20-12-2025 02:33:23 AM
న్యూఢిల్లీ, డిసెంబర్19: ఆన్లైన్ బెట్టింగ్, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు స్పీడ్ పెంచారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల ఆస్తులను ఆస్తులను జప్తు చేశారు. రూ.1,000 కోట్లకు పైగా విలువైన బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, నటుడు సోనూసూద్ ఆస్తులను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసినట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.
ఫెడరల్ దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత నటి నేహాశర్మ, మోడల్ ఊర్వశి రౌతేలా తల్లి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఆస్తులను కూడా జప్తు చేసినట్లు పేర్కొన్నాయి. తాజాగా అటా చ్ చేసిన ఆస్తుల విలు వ రూ.7.93 కోట్లని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జప్తు చేసిన ఆస్తుల లో సోనూసూద్‌కు చెందిన సుమారు రూ.1 కోటి, చక్రవర్తికి చెందిన రూ.59 లక్షలు, యువరాజ్ సింగ్‌కు చెందిన రూ.2.5 కోట్లు, నేహాశర్మకు చెందిన రూ.1.26 కోట్లు, ఊతప్పకు చెందిన రూ.8.26 లక్షలు, అంకుష్ హజ్రాకు చెందిన రూ.47 లక్షలు, ఊర్వశీరౌతేలా తల్లికి చెందిన రూ.2.02 కోట్లు ఉన్నా యని అధికారులు తెలిపారు.
ఈ ప్రముఖులందరినీ ఈడీ గతంలో విచారించిన విష యం తెలిసిందే. ఈ ఆస్తులను 1ఎక్స్‌బీఈటీ(1ఎక్స్‌బెట్) బెట్టింగ్ యాప్ ద్వారానే మనీ లాండరింగ్ (పీఎంఎల్‌ఏ) చేసినట్లు పేర్కొన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా కొంతకా లం క్రితం మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అన్ని విషయాలూ తెలిసే 1ఎక్స్‌బెట్, దాని అనుబంధ సంస్థల ప్రమోషన్‌కు విదేశీ సంస్థ లతో ఒప్పందాలు చేసుకున్నారని ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే శిఖర్‌ధావన్‌కు చెందిన రూ.4.5 కోట్ల స్థిరాస్తిని, సురేశ్ కు చెందిన 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్‌లను సీజ్ చేసేందుకు మనీలాం డరింగ్ నిరోధక చట్టం కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ వేదికగా రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను బ్యన్ చేసిన విషయం తెలిసిందే.