calender_icon.png 20 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వీబీజీ రామ్‌జీ’తో గ్రామీణ ప్రజలకు అధిక ఆదాయ భద్రత X గాంధీ పేరు తొలగింపు సరికాదు

20-12-2025 01:08:28 AM

‘వీబీజీ రామ్‌జీ’తో గ్రామీణ ప్రజలకు అధిక ఆదాయ భద్రత

బిల్లు ఆమోదంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు హర్షం

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి): వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ బిల్లు ఆమోదంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు అధిక ఆదా య భద్రత లభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. వీబీ జీ రామ్‌జీ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించడంతో ఈమేరకు శుక్రవారం ఎక్స్ వేదిగా ఆయన స్పందించారు. ఈ బిల్లులో మూడు కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.

వార్షిక ఉపాధిని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల వేతనాల చెల్లింపులో ఆలస్యం జరగకుం డా వారానికి లేదా పక్షం రోజులకోసారి చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. నకిలీ లబ్ధిదారులను తొలగించడానికి పారదర్శకత పాటించేలా ఏఐ ఆధారిత పర్యవేక్షణ, బయోమెట్రిక్, జీపీఎస్ సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. 

గాంధీ పేరు తొలగింపు సరికాదు

  1. నేడు గాంధీ ఆసుపత్రి వద్ద.. రేపు జిల్లాల్లో నిరసనలు 
  2. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ వెల్లడి 

హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఉపాధి హామీ పథకాన్ని తొలగించి పేదలకు అన్యాయం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గడ్ విమర్శించారు. గాంధీ పేరును తొలగించి..వీబీ జీ రామ్‌జీ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్ర వారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న మహాత్మ గాంధీ విగ్రహం దగ్గర మహాత్మ గాంధీ చిత్ర పాటలతో బీజేపీ ప్రభుత్వంపై నిరసన ప్రదర్శన ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో ఆదివారం రోజున ఇవే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలన్నారు.