24-12-2025 12:05:17 AM
ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ
నకిరేకల్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఆశా వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ.18 వేలు అందించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.మంగళవారం కట్టంగూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఎదుట ఆసంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్లతో పారితోషికం లేని అనేక పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత మూడు సంవత్సరాలుగా లెప్రసీసర్వేలునిర్వహించినప్పటికీ వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. పెండింగ్లో ఉన్న లెప్రసీ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఈ సంవత్సరం చేపట్టే సర్వేలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా స్థానిక ఎన్నికలు, పల్స్ పోలియో కార్యక్రమాల్లో పనిచేసిన ఆశా వర్కర్లకు సంబంధించిన బిల్లులు కూడా ఇంకా చెల్లించలేదని, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు.
ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ సమన్వయ కమిటీ మండల కన్వీనర్ చెరుకు జానకి, ఆసంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు చౌగోని ధనలక్ష్మి, భూపతి రేణుక, శ్రామిక మహిళా మండల కన్వీనర్ అబ్బాగోని సంతోష్, సబ్ సెంటర్ లీడర్లు పద్మావతి, రేణుక, పద్మ, సైదమ్మ, శోభ, భారతి, సుజాత, సోషల్ మీడియా కన్వీనర్ గడగోజు సుజాతతో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
మర్రిగూడలో ధర్నా
మర్రిగూడ, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : మండల కేంద్రంలోని పి .హెచ్. సి ముందు ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో లెప్రసీ సర్వే చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్యశాఖ అధికారులు, ఆశలను ఆదేశించారు, కానీ గతంలో సర్వే చేస్తే అట్టి డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదని దానికి నిరసనగా పలువురు ఆశా వర్కర్లు ధర్నా చేసి స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాలినికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.
అనంతరం సి.ఐ.టి.యు.జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ డిసెంబర్ లో చేసే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని గతంలో పెండింగ్లో ఉన్న లెప్రసీ పల్స్ పోలియో ఎలక్షన్ డ్యూటీ డబ్బులు వెంటనే చెల్లించాలని, ఫికస్డ్ వేతనం రూ.18 వేలు చెల్లించాలని కోరారు, పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ ,జంపాల వసంత, సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల పద్మ, విజయ , రోజా, ఎస్కే సైదాబీ, వారాలశోభ, పల్లె కంసల్య, పగడాల బాలమణి, పొనుగోటి సునీతమ్మ ,కలకొండ. వెంకటమ్మ, పొగాకు సునిత, సునీత, మమత, ముత్యాలి, తదితరులు పాల్గొన్నారు