calender_icon.png 25 December, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర కీలకం

24-12-2025 12:06:48 AM

గరిడేపల్లి, డిసెంబర్ 23,(విజయ క్రాంతి): రైతు సంక్షేమానికి గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర కీలకమని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం గడ్డిపల్లి శ్రీ అరబిందో గ్రామీణ అభివృద్ధి సంస్థ కృషి విజ్ఞాన కేంద్రం నందు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కిసాన్ మేళా,వ్యవసాయ ప్రదర్శనకి అటారి డైరెక్టర్ షేక్ మీరాతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎన్‌ఎస్పి,ఎస్‌ఆర్‌ఎస్పి,మూసి,పాలేరు ప్రాజెక్టుల ద్వారా సూర్యాపేట జిల్లాలో సాగు నీరు పుష్కలంగా అందడంతో నాణ్యమైన సన్న బియ్యం పండించటం ద్వారా తెలంగాణ రాష్ట్రములో మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

ప్రభుత్వo ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులు పండించిన సన్న ధాన్యంకు క్వింటాకు బోనస్ 500 రూపాయలు జమ చేయటం జరిగిందనన్నారు. జిల్లాలో 80,000 ఎకరాలలో పత్తి పంట పండిస్తున్నా రని, పత్తి పంటలో అధిక సాంద్రత విత్తన పద్ధతి ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. సంప్రదాయ పంటల నుండి అధిక లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటలు పామ్ ఆయిల్ సాగు, కూరగాయలు, పండ్ల తోటలు,మల్టి క్రాపింగ్ వైపు మారితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందవచ్చని సూచించారు.

భూసార పరీక్షలు చేయించి ఎరువులు వాడాలన్నారు. తదుపరి నూతన పద్ధతులతో వ్యవసాయం చేస్తున్న అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి రామిరెడ్డి, నర్సింహులగూడం గ్రామానికి చెందిన నాగరాజును,సంగెమ్ కు చెందిన షరీఫ్ ను,నారాయణ గూడెం చెందిన వెంకటరెడ్డిని మాధవరం గ్రామానికి చెందిన రజనీ,టెర్రస్ గార్డెన్ ఫార్మర్ మమతాను కలెక్టర్,అటారీ డైరెక్టర్ ఘనంగా సన్మానం చేసి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం లో డిఏఓ శ్రీధర్ రెడ్డి,హార్టికల్చర్ అధికారి నాగయ్య,ఆటారీ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త ఏ ఆర్ రెడ్డి,కే వి కే గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త నరేష్,అధికారులు,సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.