calender_icon.png 12 July, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్‌లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలి

11-07-2025 12:00:00 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బార్ అసోసియేషన్ వినతి

హుస్నాబాద్, జులై 10 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు గురువారం ఆ అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి  వినతిపత్రాన్ని ఇచ్చారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు, న్యాయవాదులకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావా లంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అత్యవసరమని బార్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి వివరించారు.

దీనివల్ల న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతుందని, ప్రజల సమయం, ధనం ఆదా అవుతాయని వారు తెలిపారు. వారి వినతిని సానుకూలంగా పరిశీలిస్తామని, ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. వినతిపత్రాన్ని ఇచ్చిన వారిలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఒగ్గోజు సదానందం, మాజీ ఏజీపీ కన్నోజు రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, ధీకొండ ప్రవీణ్  తదితరులున్నారు.