12-07-2025 03:58:37 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): పూజ్య శ్రీ డా. బసవలింగ అవధూత మల్లియగిరి ఆశ్రమంలో శనివారం జన్మదిన వేడుకల ను నిర్వహించారు. ఈ వేడుకల్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని గురువుకు పూలమాల సమర్పించి దర్శనం చేసుకోని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ లోని ఝరా సంఘం వద్ద గల మల్లియగిరి ఆశ్రమంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ.. ప్రతి ఏటా గురువు వారి దర్శనం కొరకు ఆశ్రమం వచ్చి స్వామీజీ దర్శనం చేసుకోవడం ఆశీర్వచనాలు తీసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంటుందని, మనసుకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. శ్రీ అవధూత డా” బసవలింగ గురువు దర్శనం చేసుకోవడం వల్ల జుక్కల్ మండల రైతులకు కార్మికులకు పంటలు బాగా పండాలని దిగుబడి మంచి రావాలని ఆశీర్వదించారని తెలిపారు.