12-07-2025 03:54:39 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): ఇటీవల ఉద్యోగ పదవి విరమణ పొందిన కటుకూరి మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు సన్మానించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో మల్లారెడ్డి నివాసంకి వెళ్లి ప్రణవ్ బాబు మల్లారెడ్డికి బొకే అందజేసి శాలువాతో శనివారం సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని, విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో 1992 లో ఉద్యోగంలో చేరిన మల్లా రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్ గా హుజురాబాద్ ప్రాంతంలో 30 ఏళ్ళ పాటు విధులు నిర్వర్తించారన్నారు. డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదోన్నతి పొంది సిరిసిల్ల, జగిత్యాల సబ్ డివిజన్లో పని చేసి జూన్ 30 న పదవి విరమణ పొందారన్నారు. జర్నలిజంపై ఉన్న మక్కువతో అంతకుముందు కొన్నేళ్లపాటు రిపోర్టర్ గా పని చేసి వార్త మల్లన్న గా ఈ ప్రాంతానికి సుపరిచితుడయ్యారు. విరమణ ఉద్యోగానికే తప్ప ప్రజా సేవకు కాదని, భవిష్యత్తులో ప్రజాసేవ చేసే అవకాశం వస్తుందని ఆకాంక్షించారు.