calender_icon.png 12 July, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తాం

12-07-2025 03:51:07 PM

సిద్ధిపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోందని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి చూపిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ తెలిపారు. సిద్ధిపేటలోని 14వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పేదల ఇంటి కల సాకారమవుతోందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు లిస్టులో పేరు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలను మోసగించారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉనికిని కాపాడుకునేందుకు అలజడి సృష్టిస్తున్నదని ఆరోపించారు.