calender_icon.png 12 July, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

12-07-2025 03:41:22 PM

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు

తుంగతుర్తి(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాలలో వెనుకబడిందని ఈనెల 14వ తారీఖున నియోజకవర్గంలో నిర్వహించేటటువంటి ముఖ్యమంత్రి సభలో విద్యా వైద్య రవాణా సదుపాయాలు కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సాయిబాబు ప్రభుత్వాన్ని కోరారు సాగునీటి రంగంలో కూడా వారాబంది విధానాన్ని రద్దుచేసి రైతులకు నిత్యం సాగునీరు అందించేలా కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృత్తి విద్యా కళాశాల లేదని తుంగతుర్తి 100 పడకల ఆసుపత్రికి పూర్తి నిధులు కేటాయించి దానికి అనుగుణంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు.

నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నియోజకవర్గ కేంద్రాన్ని రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మోత్కూర్ ను కూడా రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలన్నారు నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా ఉన్నారని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు నిధులు కేటాయించి పనులు చేపట్టాలన్నారు. తిరుమలగిరి పట్టణంలో మినీ బస్ డిపోను ఏర్పాటు చేయాలన్నారు మోత్కూర్ లో వంద పడకల ఆసుపత్రి  ఏర్పాటు చేయాలన్నారు. రుద్రమ చెరువును రిజర్వాయర్ చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలి అన్నారు.

ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుచేసి యువత ఉపాధి  కల్పించాలని కోరారు. ప్రసిద్ధపనిగిరి బౌద్ధ క్షేత్రానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు  నియోజకవర్గంలోని అనేక అంతర్గత రహదారులు అద్వాన పరిస్థితిలో ఉన్నాయని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా లేదని వెంటనే రహదారుల నిర్మాణం పూర్తి చేసి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిన ప్రజలకు బియ్యం ఉచితంగా ఇచ్చేది మాత్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నారాయణదాసు నాగరాజు గాజుల మహేందర్ ,మండల ప్రధాన కార్యదర్శి సంకృనాయక్ ,పూ సపల్లి శ్రీనివాస్ పొడిటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు