31-07-2025 01:24:33 AM
రాష్ట్ర స్వర్ణకార సంఘం
ఖైరతాబాద్, జూలై 30 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా జనాభా కలిగిన విశ్వబ్రా హ్మణ స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిం చాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సం ఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు రాఘవా చారి, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామిలు మాట్లాడారు..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం చేతివృత్తులకు మంచి రోజులు వస్తాయని భావించి స్వరాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని, 200 మంది స్వర్ణకారులు ఆకలితో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభు త్వం ప్రత్యేక స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ జీవితాలను ఆదుకోవాలని కోరారు.
కార్పొరేట్ జ్యువెల రీలలో పుస్తె మట్టలు అమ్మకుండా స్థానిక స్వర్ణకారులు చేసే విధంగా ప్రభుత్వం జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 50 సంవత్సరాల నుండి నా ప్రతి స్వర్ణకారుడికి పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మహిళ అధ్యక్షురాలు మనోరమ్మ, కోశాధికారి గొట్టుముక్కల చంద్రశేఖర్, నాగరాజు చారి, దుబ్బాక కిషన్, ఇంద్రాల రాజు తదితరులు పాల్గొన్నారు.