31-07-2025 01:26:25 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు తుమ్మల సూచన
హైదరాబాద్, జులై 30 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న రాంచందర్‌రా వు అర్థరహిత మాటలు మాట్లాడ టం సరికాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రకటనలో హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్ కోసం కేటాయించిన ఎరువులు గురించి అడుగుతుంటే.. రాష్ర్ట బీజేపీ నాయకులు 2024- యాసంగి గు రించి మాట్లడటం వారి అవివేకానికి నిదర్శమన్నారు.
2024- 25 యాసంగికి సంబంధించిన మిగులు యూరి యా 1.92 మెట్రిక్ లక్షల టన్నులు రాష్ర్ట ప్రభు త్వం దగ్గర ఉన్నందువల్లే, కేంద్రం ఈ ఖరీఫ్‌లో కేటాయింపుల మేరకు ఇవ్వకపోయినా తమ శాఖ అధికారులు ఇప్పటివరకు సర్దుబాటు చేశారని తెలిపారు.