calender_icon.png 22 July, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిపురంలో పిడుగు పాటుకు తృటిలో తప్పిన గొర్రెల కాపరి ప్రాణం

21-07-2025 07:13:40 PM

చిల్లపల్లికి చెందిన పుట్ట పోచయ్య 30 గోర్లు మృతి..

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని సిరిపురంలో పిడుగు పడడంతో అదృష్టవశక్తి గొర్రెల కాపరి ప్రాణం తృటిలో తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం చిల్లపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పుట్ట పోచయ్య సిరిపురం దగ్గర గోదావరి ఒడ్డుకు గొర్రెలను మేపాడానికి వెళ్లగా సాయంత్రం 5 గంటల సమయంలో ఒకేసారి పెద్దశబ్దంతో గొర్రెల మందపైన పిడుగు పడటంతో  30 గోర్లు అక్కడికక్కడే మృతి చెందాయి.

అక్కడే ఉన్న గొర్రెల కాపరి పుట్ట పోచయ్య కళ్ళు ఒకేసారి మూతలు పడి స్పృహ కొలిపోయారు. అక్కడే ఉన్న గొర్రెలు మేపుతున్న మరో గొర్రెల కాపరి గంగయ్య వెంటనే వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వెళ్ళి వెంటనే పుట్ట పోచయ్యను హాస్పిటల్ కి తరలించారు. ప్రభుత్వం వెంటనే పిడుగు పాటుకు గురై 30 గొర్రెల మృతితో దాదాపు రూ. 3 లక్షల పైగ నష్టం జరిగిందని, అ గొర్రెల కాపరి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని నష్టం పరిహారం చెల్లించాలని మంథని యాదవ సంఘం మండల అధ్యక్షులు పరిశవేన మోహన్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.