21-07-2025 07:10:08 PM
హైదరాబాద్: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్ కార్డుల పంపిణీపై సమీక్షించారు. 7 లక్షలకుపైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తుండడంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నాలని సూచించారు. అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరగాలని, ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు కలెక్టర్లు పాల్గొన్నారు.