calender_icon.png 22 July, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా..

21-07-2025 07:22:15 PM

జిల్లా కాంగ్రెస్ నాయకులు గురిజాల గోపి..

మణుగూరు (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కాంగ్రెస్ నాయకులు గురిజాల గోపి పేర్కొన్నారు. సోమవారం రేణుక చౌదరి క్యాంప్ కార్యాలయంలో రేణుక అక్షర మహిళా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్ తండ్రి రాజమౌళి ఇటీ వలే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. రేణుక అక్షర మహిళా మండలి సభ్యులతో కలిసి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు.

అనంతరం గోపి మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్ప దని అభివర్ణించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందు ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండల అధ్యక్షురాలు పూనెం సరోజ, సీనియర్ నాయ కురాలు ఎండీ. షబానా, ఉపాధ్య క్షురాలు బొడ్డు సౌజన్య, జనరల్ సెక్రెటరీ రెడ్డీబోయిన రేణుక, నాం పల్లి రమణ, కన్నారపు వసంత, డేరంగుల సుజాత, భవాని తదితరులు పాల్గొన్నారు.