26-10-2025 12:18:14 AM
సీఐడీ పనితీరుపై డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : రాష్ర్టంలో నేరాల కట్టడికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని, ప్రజలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించా లని రాష్ర్ట డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ బి. శివధర్ రెడ్డి సీఐడీ అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం ఒక ప్రధాన నేరాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని, దానిని సమూలం గా నిర్మూలించే దిశగా పనిచేయాలని ఆయ న స్పష్టం చేశారు.
శనివారం తన కార్యాలయంలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్‌మెంట్ సీఐడీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసినా, డీఐజీ నారాయణ నాయక్ హాజరయ్యారు. డీజీపీ ఎస్సీఆర్బీ, పీసీఆర్, సెంట ర్ ఆఫ్ ఎక్సలెన్స్, సీసీటీఎన్‌ఎస్, విమెన్ సేఫ్టీ వింగ్ తదితర విభాగాల పనితీరును సమీక్షించారు.
గత ఐదేళ్ల నేరాల గణాంకాలను పరిశీలించి, జిల్లాల వారీగా నేరాల తీరుపై, వాటి వెనుక ఉన్న స్థానిక పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ఈ సంద ర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ విభాగాల ఉన్నతాధికారులు నేరాలను సమర్థంగా విశ్లేషించినప్పుడే, కింది స్థాయి సిబ్బంది కూడా మరింత నైపుణ్యం తో పనిచేస్తారని పేర్కొన్నారు.
దొంగతనాలకు పాల్పడే ముఠాల వివరాలను సేకరిం చాలని ఆదేశించారు. పోలీసు డ్రైవర్లకు దృష్టి లోపం కారణంగా ప్రమాదాలు జరిగితే, వారికి కంటి పరీక్షలు చేయించాలని సంబంధిత అధికారులకు సూచించాలని తెలిపారు.