26-10-2025 12:20:34 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): హ్యామ్ రోడ్ల పేరిట ప్రభుత్వం చేపట్టింది పెద్ద స్కామ్ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కుంభకోణాల నిలయం, అవినీతి మయమైపోయిందని పేర్కొన్నారు. హ్యామ్ మోడల్‌లో రోడ్ల అభివృద్ధి పేరిట దాదాపు రూ.8 వేల కోట్ల కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేయబోతున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివా రం ఆయన మాట్లాడారు.
ఒక పని టెండర్ కోసం ఇద్దరు మంత్రులు కొట్టుకొని సీఎం దగ్గర సెటిల్మెంట్ చేసుకొని ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారని, ఒక పారిశ్రామిక వేత్తను బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యవహారంలో ఒక మంత్రి, మంత్రి కుటుంబం సీఎం పేషీ మీద ఏం మాట్లాడారో చూశామ ని అన్నారు. మద్యం సీసాల మీద లేబుల్ల టెండర్ విషయంలో మంత్రి చెప్పినట్టు వినలేదని ఒక అధికారిని బదిలీ చేయడం, దాం ట్లో సీఎం పేషీ జోక్యం ఉందని ఆరోపించా రు.
రాష్ర్టంలో రోడ్లకు మహర్దశ పట్టనున్నదని డిప్యూటీ సీఎం, ఆర్‌అండ్‌బీ మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అనేక మీటింగ్‌లలో అంటున్నారని, హ్యామ్ ద్వారా రూ. 27,000 కోట్లతో రోడ్లు వేయబోతున్నామ ని, రోడ్లన్నీ అద్దాల లాగా అయిపోతాయని ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. హ్యామ్ మోడల్‌లో రోడ్లు బాగు చేసే ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు దోచుకొనే స్కామ్ అని ఆరోపించారు.
మొత్తం రూ.27 వేల కోట్లతో చేపట్టే ప్రాజెక్ట్ మొదటి దశలో రూ.17,000 కోట్లతో పను లు చేపట్టబోతుంటే అందులోనే రూ.8 వేల కోట్ల కుంభకోణం జరగబోతున్నదని ఆరోపించారు. హ్యామ్ ద్వారా రూ.10,547 కోట్ల వ్యయంతో నిర్మించే 5,566 కి.మీ రోడ్లకు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి 22.10.2025 తేదీ ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ఒక జీవో, పంచాయతీ రాజ్ శాఖలో 16.10.2025న 7,449 కి. మీకు రూ.6,294 కోట్లతో టెండర్లు పిలిచారని వివరించారు.
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలు కలిపి రూ.1,7000 కోట్లతో టెండర్లు పిలిచాయని చెప్పారు. సీఆర్‌ఐఎఫ్‌లో సింగిల్ లైన్ డబు ల్ లైన్‌గా మార్చడానికి విత్ టాక్స్ రూ.1.75 కోట్లు ఖర్చు అయితే హ్యామ్ మోడల్‌లో సిం గిల్ లైన్ డబుల్ లైన్‌గా మార్చడానికి టాక్స్ లేకుండా రూ.2.75 కోట్లు, విత్ టాక్స్ రూ. 3.30 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఇచ్చిన సీఆర్‌ఐఎఫ్ పను ల్లో ఒక కి.మీకు రూ.1.75 కోట్లు అయితే అదే శాఖ ఇచ్చిన హ్యామ్ మోడల్ ప్రకారం ఒక్క కి.మీకు రూ.3.30 కోట్లు ఖర్చు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఒక కి.మీ రోడ్ వేయడానికి దాదాపు 85 శాతం అంచనాల ను హ్యామ్ మోడల్‌లో పెంచారని చెప్పారు. హ్యామ్ మోడల్‌లో తీసుకున్న 1000 రోడ్ల న్ని విడివిడిగా కాకుండా పెద్ద ప్యాకేజీ రూపంలో టెండర్లు పిలుస్తున్నారని, చిన్న కాంట్రాక్టర్లు బిడ్‌లో పాల్గొనకుండా చేసి పెద్ద కాంట్రాక్టర్లకు ప్యాకేజీలవారీగా అప్పజెప్పే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముందే 10 శాతం అంటే రూ.1,700 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయంంచారని, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినట్టు ఇచ్చి ప్రభుత్వ పెద్ద లే వాటిని నొక్కేసే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించారు.
హ్యామ్ టెండర్లను రద్దు చేయాలి..
రాష్ర్టంలో గుంతలు పూడ్చడానికి, చిన్న కాంట్రాక్టర్లకు కానీ, ఇప్పటికే కొనసాగుతున్న పనులకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రూ.1,700 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏవిధంగా లూటీ చేస్తున్నదో ప్రజలు గమనించాలని సూచించారు. 5 ఏండ్లకు ఒకసారి 8 శాతం, 12 ఏండ్లకు మళ్లీ 8 శాతం కాంట్రాక్టర్లకు మెయింటనెన్స్ కింద అదనంగా ఇవ్వడానికి, మొత్తంగా ఒక కి.మీ హ్యామ్ పేరిట 15 ఏండ్లకు రూ.6 కోట్లు ఖర్చు చేయడానికి కాం గ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిందన్నారు.
రూ. 9,000 కోట్లలో కావాల్సిన హ్యామ్ మోడల్‌లో రూ.17,000 కోట్లకు పెంచి 15 ఏండ్ల మెయింటనెన్స్ పేరిట హ్యామ్ ముసుగులో రూ.50,000 కోట్లకు అంచనాలు పెంచారని ఆరోపించారు. ప్రజలపై భారం మోపి కోట్లు దండుకునే కుట్రను ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారని, ఈ విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ అయ్యిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం పేరిట రూ.8000 కోట్లు దోచుకునే హ్యామ్ మోడల్‌ను డిజైన్ చేస్తున్న ఉన్నతాధికారులు, పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లు, పనులు చేసే కాం ట్రాక్టర్లు ఇందులో భాగస్వామ్యం కావొద్దని, రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
ప్రభుత్వం ఇప్ప టికైనా ఈ దోపిడీ చేసే హ్యామ్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టం లో మంత్రుల మధ్య రోజు జరుగుతున్న అవినీతి కుంబకోణలపై ఒక్క బీజేపీ నాయకుడూ మాట్లాడటం లేదని, ఇందులో పెద్ద అవినీతి జరుగుతున్నందున కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోవాలని సూచించారు.
హ్యామ్ మోడల్‌లో జరుగుతున్న రూ.8000 కోట్ల కుంభకోణంపై కేంద్ర సంస్థలతో దర్యా ప్తు చేయించాలని, లేని పక్షంలో దీనిలో బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలకు భాగస్వమ్యం ఉందని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజ య్, కాలేరు వెంకటేశ్, నేతలు ఆయాచితం శ్రీధర్, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.