26-10-2025 12:16:56 AM
సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి
చేవెళ్ల, అక్టోబర్ 25 : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. శనివారం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, నూతన ఓలా స్కూటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రాంతం లో గేటెడ్ కమ్యూనిటీస్, రిసారట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లు , ఫామ్ హౌస్ లు ఏర్పాటు కావడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు.
దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాల నిర్మూలనలో భాగంగా బ్లాక్ స్పాట్స్ గుర్తించి, బోల్ గాడ్స్ రిఫ్లెక్టెడ్ స్టేట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో సైబర్ నేరాలు పట్టణ ప్రాంతంలో మాత్రమే జరిగేవని ప్రస్తుతం సైబర్ నేరాలు గ్రామాల్లో సైతం జరుగుతున్నాయన్నారు. గత సంవత్సరం 13 వేల సైబర్ కేసులు నమోదు కాగా , రూ.780 కోట్లను సైబర్ నేరస్థులు కాజేశారని చెప్పారు.
ప్రస్తుతం ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన వచ్చిందని, ఈ సంవత్సరం సైబర్ నేరాలు 25% తగ్గుతాయని ఆయన అంచనా వేశారు. డ్రగ్స్, గంజాయి పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు. చేవెళ్ల ప్రాంతంలో 1000కి పైగా ఫామ్ హౌస్ లు ఉన్నాయని, అందులో తరచూ వివిధ రకాల ఈవెంట్లు జరుగుతుండడంతో గంజాయి, డ్రగ్స్ సప్లై దారులపై ప్రత్యేక పోకస్ పెట్టామని వెల్లడించారు.
551 సీసీ కెమెరాలు
చేవెళ్ల కంట్రోల్ రూమ్ లో 551 సీసీ కెమెరాలు, 12 ఎల్‌ఈడి స్క్రీన్ లను స్థానిక ప్రజలు సహకారంతో టీవీలు ఏర్పాటు చేశామని సీపీ చెప్పారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూంతో చేవెళ్ల పట్టణం, 20 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేశామని వెల్లడించారు. కెమెరాల పనితీరు పరిశీలించేందుకు సాంకేతిక పరమైన టీంను ఏర్పాటు చేశామని చెప్పారు. నేర పరిశోధణ, రోడ్డు ప్రమాదాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను స్థానిక ప్రజల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. డీసీపీ, ఏసీపీ, సీఐలు, ఎస్ ఐలను, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్, అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ రావు, సీఐ భూపాల్ శ్రీధర్, డిఐ(సీఐ) జె. ఉపేందుర్, ఎస్‌ఐ లు సంతోష్ రెడ్డి, వనం శిరీష ,తేజశ్రీ, బి. శిరీష తదితరులు ఉన్నారు.