calender_icon.png 4 August, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కలం’ స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం

04-08-2025 12:29:05 AM

ఎల్బీనగర్, ఆగస్టు 3 : ఎక్కడో పు ట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము అ న్నట్టు... ఇంటర్నెట్ లేని కాలంలో అ ప్పుడెప్పుడో 1990లో ఉత్తరాల ద్వా రా పరిచయమైన స్నేహితులు ఇప్ప టి వరకు ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ తమ స్నేహాన్ని చాటుకుంటున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో స్నేహితుల సమ్మేళనం నిర్వహించారు.

స్నేహితులందరూ... ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టుకున్నారు. కరోనా సమయంలో మృతి చెందిన మిత్రుడు బాబు సార్ ను స్మరించుకున్నారు. వండర్ వరల్డ్, ఆంధ్రభూమి కలం స్నేహం శీర్షిక ద్వారా వివిధ జిల్లాల నుంచి పరిచయమైన వీరంతా ఇప్పటి వరకు స్నేహితులుగా కలిసి ఉన్నారు.

అందరూ కలసి ’Penfone Friends association’ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఫ్రెండ్ షిప్ డే తప్పనిసరిగా కలుసుకుంటారు. కార్యక్రమంలో శరత్, పుల్లారెడ్డి, నాగరాజు, మల్లికార్జున, ఆంజనేయులు, అస్లాం, షరీఫ్, నాగవీరేంద్ర, కిశోర్, రవిపాల్ రెడ్డి, టీవీ నటుడు మురళీకృష్ణ, దొరైస్వామి, రాజయ్య గౌడ్, జిలానీ పాల్గొన్నారు.