calender_icon.png 4 August, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

04-08-2025 12:30:28 AM

 కొండాపూర్, ఆగస్టు 3 :  కొండాపూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామంలో బీర్‌ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ రఘునాథ్ రెడ్డి తండ్రి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు.

అలాగే తేర్పోల్ గ్రామానికి చెందిన బోయినీ ప్రసాద్ అనే కార్యకర్త అకాల మరణం పట్ల వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ వారి కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మ్యాకం విఠల్, జనరల్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, నాయకులు ఇంద్రారెడ్డి, వహీద్, కిరణ్, జాలిల్, రాములు, భూపాల్ గౌడ్, అజీమ్,కుమార్, శ్రీశైలం అజీమ్, నర్సింలు, సంగమేశ్వర్, తేర్పోల్ లో మాజీ ఎంపీటీసీ మోహన్ గౌడ్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శేఖర్, కిష్ట రెడ్డి, హరిదాస్ పూర్ మాజీ సర్పంచ్ షాపి, మమ్మద్, డి నారాయణ, ఏ ప్రభు, ఎర్ర నందు, రహీం పాల్గొన్నారు.