17-12-2025 04:23:56 PM
జైపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న మూడవ విడత పోలింగ్ ను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. మండలంలోని ఇందారంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఆర్ ఓకి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ సత్యనారాయణ, తహశీల్దార్ వనజా రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తదితరులున్నారు.