calender_icon.png 17 December, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రకల్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!

17-12-2025 04:21:50 PM

▪️ వరుసగా ఐదు ఇళ్లల్లో చోరీ

▪️ 2.50 తులాల బంగారం, కేజీ వెండి, నగదు, వాహనం మాయం

▪️ ఘటన ఆలస్యంగా వెలుగులోకి

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో వరుసగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసారు. ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి బంగారం, వెండి, నగదు, వాహనాలను దోచుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కొరుపాల కృష్ణయ్య ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి తాళం ధ్వంసం చేసి ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారం, కేజీ వెండి, రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు.

అదే గ్రామానికి చెందిన రషీద్ ఇంట్లో బీరువాలో దాచుకున్న అర తులం బంగారం, రూ.25 వేల నగదును అపహరించారు. ఎల్లా గౌడ్, వార్ల శ్రీను ఇళ్లలో తాళాలు విరగొట్టి బీరువాలు ధ్వంసం చేసినప్పటికీ నగదు లభించకపోవడంతో వదిలేసి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి ఇంటి ముందు ఉంచిన బుల్లెట్ వాహనాన్ని దొంగలు చోరీ చేసి నాగర్ కర్నూల్ వైపు వెళ్తుండగా కాటన్ మిల్లు వద్ద అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిసింది. అక్కడే వాహనాన్ని వదిలి దొంగలు పరారైనట్లు గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి గట్టి బందోబస్తూ చేపట్టారు.