calender_icon.png 25 October, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసరలో కీచక ఉపాధ్యాయుడు

25-10-2025 12:00:00 AM

-విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన

-పోక్సో చట్టం కింద కేసు నమోదు

నిర్మల్ అక్టోబర్ 24 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుల ఘటన మర్చిపోక ముందే నిర్మల్ జిల్లాలో మరో ఉపాధ్యాయు డికీచక పర్వం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయు డు ముర్తుజా  అలీ విద్యార్థుల పట్ల అసభ్యం గా ప్రవర్తించారు.

పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం తో బాలిక వారి కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయుని తీరుపై తెలిపినట్టు వివరించారు. వారం రోజుల క్రితమే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పాఠశాల ప్రధానో పాధ్యాయులు ఇన్చార్జి ఎంఈఓ మైసజీ దృష్టికి వెళ్ళింది. ఈ మేరకు ఉపాధ్యాయుని తీరుపై ప్రధానోపాధ్యాయులు వాకాపు చేసినప్పటికీ అతను తప్పించుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల చేరి ప్రధానోపాధ్యాయులు మైసవితో పాటు ఉపాధ్యాయుని నిలదీశారు.

ఉపాధ్యాయుడు ముర్తుజా అలీ కొన్ని రోజులుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న తోటి ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం పై శుక్రవారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకొని ఉపాధ్యాయు లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు మృతుజ పై స్థానిక పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కింద మైనర్ విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఈ విషయం స్థానికంగా సంచలన సృష్టించగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శుక్రవారం పాఠశాలకు జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు ముధోల్ సిఐ మల్లేష్ బాసర ఎస్త్స్ర తదితరులు చేరుకొని పాఠశాలల్లో విద్యార్థులు పిలిపించి మహిళా కానిస్టే బుల్‌తో లోతుగా విచారణ జరిపారు. బాలికలు ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అస భ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులు చేస్తున్నారని పాఠశాల విద్యార్థులు పోలీసులకు తెలపడంతో శుక్రవారం సదరు ఉపాధ్యాయుడు మృతుజా ఆలీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ముధోల్ సిఐ మల్లేష్ తెలిపారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న ప్రధా నోపాధ్యాయులు ఇన్‌చార్జ్ ఎంఈఓ మైసజీ పై కూడా విచారణ చేసి ఈ ఘటనకు బాధ్యతగా పేర్కొంటూ శాఖ పరమైన విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

విద్యా ర్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే విద్యార్థులపై లైంగిక వేధింపులు చేయడంపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నట్టు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కీచక పర్వం ఒక్కటి వెలుగులోకి రావడంతో విద్యాశాఖకు తీరని మచ్చ తెచ్చి పెడుతుండగా దీన్ని గార్డరే పెట్టేందుకు పోలీస్ శాఖ సైతం పాఠశాల ఉపాధ్యాయులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు