25-10-2025 10:31:10 PM
మందుబాబులు రెండు రోజుల పాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని న్యాయమూర్తి తీర్పు
ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిన ఏడుగురికి శనివారం ఖమ్మం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి బక్కెర నాగలక్ష్మి ముందు హాజరుపరిచినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయమూర్తి ఏడుగురికి రెండు వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులు రెండు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులకు సహాయంగా నగరంలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ కమ్యూనిటీ సేవ చేయాలని తీర్పు వెల్లడించారని తెలిపారు.