calender_icon.png 26 October, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ పురుగు మందుల తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు

25-10-2025 10:52:48 PM

అయిజ: ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పురుగుల మందులు తయారు చేస్తు రైతులను మోసం చేస్తున్న కేంద్రంపై పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా శనివారం దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో సూపర్ సింబోలా మైక్రోనూట్రింట్ కంపెనీ పేరు పెట్టి నకిలీ మందులు తయారు చేస్తున్న నిర్వాహకుడు బత్తిని వీరేష్ ఎలాంటి అనుమతులు లేకుండా 25 రకాల పురుగుమందులు తయారు చేస్తున్నట్లు గుర్తించామని ఈ దాడులలో రూ.4,66,800 విలువ గల పిచికారి మందులను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు వీరేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శాంతినగన్ సిఐ టాటా బాబు తెలిపారు. దాడులలో మండల వ్యవసాయ శాఖ అధికారి జనార్ధన్ ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు