calender_icon.png 26 October, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవాలి

25-10-2025 10:32:46 PM

వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు

పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

వెంకటాపూర్/రామప్ప (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వెంకటాపూర్ పోలీస్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తి, సేవా భావం పెంపొందించాలనే ఉద్దేశంతో వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ఎస్సై చల్లా రాజు తెలిపారు. అనంతరం వేదవ్యాస ఉన్నత పాఠశాల విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు ఆహ్వానించి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో విద్యార్థులకు పోలీసులు నిర్వర్తించే విధులు, నేరాల నియంత్రణ, చట్టాల అమలు, ప్రజా భద్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని పోలీస్ విధులపై ప్రశ్నలు అడిగారు. పోలీసులు సహనంగా సమాధానాలు ఇచ్చి వారికి ప్రేరణనిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై చల్లా రాజు మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, విద్యార్థులు చట్టానికి గౌరవం చూపుతూ సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసు సిబ్బందీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.