calender_icon.png 26 October, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎస్ యుటిఎఫ్ మండల మహాసభ

25-10-2025 11:01:13 PM

ముఖ్య అతిథులుగా ఎంఈఓ సరస్వతి..

మిడ్జిల్: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సి వెంకటయ్య అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానంగా పరిరక్షణ కోసం ఉపాధ్యాయ సంక్షేమం కోసం సంఘం నిబద్ధతతో పనిచేస్తుందని ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని పిఆర్సి నివేదికను తీసుకొని వెంటనే అమలు చేయాలని వారు తెలిపారు.

అన్ని రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేసి ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని మధ్యాహ్న భోజనం బిల్లులు జీతాలు నెల నెల అందించాలని కోరారు. ఈ సభలో ఎఫ్డబ్ల్యుఎఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ పథకంలో చేరిన సభ్యులకు ఆ పథకం సంబంధించిన బాండ్లను మండల విద్యాధికారిచే అందించడం జరిగిందన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సి వెంకటయ్య. ప్రధాన కార్యదర్శిగా కె రమేష్. ఉపాధ్యక్షులుగా నరసింహులు. బి ప్రియాంక. కోశాధికారి రవికుమార్. తదితరులను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవికుమార్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు