25-10-2025 10:37:18 PM
మందమర్రి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు కాంపల్లి సమ్మయ్యకు అవకాశం కల్పించాలని ఐఎన్టియుసి కేంద్ర కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ యేకుల సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ తరుపున పోరాటం చేస్తున్న కార్మిక నేత సమ్మయ్యకే అధ్యక్ష పదవి దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం, యూనియన్ కోసం నిరంతర శ్రమిస్తున్నాడన్నారు. యూనియన్ నాయకుని పట్ల కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉండటంతో అధ్యక్ష పదవి ఆయననే వరించే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు ఆరకొండ ఆంజనేయులు, నూనె సాంబయ్య, డి మల్లికార్జున్, జే నరసింహారెడ్డిలు పాల్గొన్నారు.