calender_icon.png 26 October, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీలో 100 కుటుంబాలు చేరిక

25-10-2025 10:39:37 PM

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ..

రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం..

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..

ఆళ్ళపల్లి (విజయక్రాంతి): మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం రాయిగూడెం గ్రామంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా రాయిగూడెం, మైలారం, తునికుబండల, రామంజిగూడెం గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నుండి 100 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ కండువాలు కప్పి రేగా కాంతారావు పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్ఎస్ మండల నాయకులు తాటి నాగేశ్వరరావు, తాటి భద్రయ్య, గొగ్గెల రాజబాబు, సాగబోయిన నారాయణల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా రేగ కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలతో గద్దెనెక్కిందని ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని అన్నారు.

గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పథకాలనే శంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని అబద్ధాల మాటలతో పేద ప్రజలను మోసం చేస్తుందన్నారు కెసిఆర్ హయాంలో బీద బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాయని నేటి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు . రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం మైలారం గ్రామానికి చెందిన కార్యకర్త ఆరం సత్యం ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంజు భార్గవి మాజీ జెడ్పిటిసి కొమరం హనుమంతరావు టిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు పాయం నరసింహారావు ఎస్.కె బాబా యువజన నాయకులు సయ్యద్ ఆరిఫ్ మైనార్టీ నాయకులు మహమ్మద్ ఆదం ఖయ్యూం మండల నాయకులు నరెడ్ల ప్రవీణ్, కుమార్ వర్మ , కొడం వెంకన్న, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.