25-10-2025 10:43:24 PM
ఈనెల 26 నుండి 28 వరకు శ్రీ రామ యజ్ఞ మహోత్సవాలు
నేరేడుచర్ల (విజయక్రాంతి): నేరేడుచర్లలోని తహసిల్దార్ కార్యాలయం సమీపంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీకమాసం సందర్భంగా శ్రీ రామ యజ్ఞ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ శనివారం తెలిపారు.
ఆలయ పూజారి బృందావనం శ్రీరామ నరసింహ తేజ ఆధ్వర్యంలో ఈనెల 26న ఆదివారం దాతల సహకారంతో ఏర్పాటుచేసిన స్వామివారి నూతన ఉత్సవ విగ్రహాలు రామ దండం ఉదయం 7-00 గంటలకు పాత రామాలయం నుండి గుడి ఆవరణలోకి ఊరేగింపుగా తీసుకొనిరావడం, రామదండానికి అభిషేకం, స్వామివారికి నూతన వెండి యజ్ఞోపవీతం, ఆంజనేయ స్వామికి మకర తోరణం కిరీటం గధ సమర్పణ రెండవ రోజు 27న సోమవారం రామదండానికి అభిషేకం రాముల వారి నూతన ఉత్సవ విగ్రహాలకి గులాబీ పూలతో అష్టోత్తర పూజ, మూడవ రోజు 28న మంగళవారం విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు అరటికాయలతో అలంకారం అనంతరం శ్రీరామ యజ్ఞం, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని రామరక్షా మన మీద ఉండాలని రామదండానికి విశేష అభిషేకాలు హోమం అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోదండ రాముడి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ కోరారు.