calender_icon.png 25 October, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరిట సైబర్ మోసం

25-10-2025 12:00:00 AM

రూ.48,500 నష్టపోయిన బాధితుడు

మందమర్రి, అక్టోబర్ 24 :పట్టణం మొద టి జోన్ ప్రాంతానికి చెందిన యువకుడు పార్ట్ టైమ్ ఉద్యోగం పేరిట సైబర్ వాళ్ళో చిక్కి ఆన్ లైన్ మోసానికి గురైన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ‘గూగుల్ రివ్యూ మేనేజ్మెంట్’ సంస్థలో ఉద్యోగం పేరుతో వచ్చిన వాట్సాప్ మెసేజ్‌కు స్పం దించి, సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఓ బాధితుడు రూ.48,500లు నష్ట పోయారన్నారు.

ఈ సం ఘటనలో సైబర్ నేరగాళ్లు ముందుగా చిన్న టాస్క్‌లతో పూర్తి చేయించి, రూ.200 వంటి స్వల్ప మొత్తాన్ని జీతంగా చెల్లించారని, తరువాత, ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి,  బాధితుడిని పలు దఫాలుగా వారి ఖాతాలకు డబ్బు పంపమని ఒత్తిడి చేయగా రూ. 48,500 చెల్లించి నష్ట పోయారన్నారు. ఇటువంటి మోసపూరిత సైబర్ వలలో ఎవరూ చిక్కుకోవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఆన్లైన్, పార్ట్టైమ్, జాబ్ ఆఫర్లను అస్స లు నమ్మొద్దని సూచించారు.. అలాగే, బ్యాంక్ వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్, ఇతర వ్యక్తి గత సమాచారాన్ని ఫోన్లో గానీ, మెసేజ్ల ద్వారా గానీ ఎవరికీ తెలుపొద్దని కోరారు.  ప్రతి ఒక్క రూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండి, అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.