calender_icon.png 23 July, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర విషాదం

27-06-2025 12:41:40 AM

  1. బంగూయ్‌లోని ఉన్నత పాఠశాలలో తొక్కిసలాట
  2. 29 మంది చిన్నారులు మృతి.. 250 మందికి గాయాలు

బంగూయ్, జూన్ 26: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగూయ్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఉన్నత పాఠశాల ఆవరణలో పేలుడు సంభవించింది. ఈ క్రమంలో పాఠశాలలో తొక్కి సలాట జరిగింది. ఈ కారణంగా 29 మంది చిన్నారులు మృతి చెందగా.. సుమారు 250 మందికి పైగా పిల్లలు గాయపడినట్టు తెలుస్తోంది.

క్షతగాత్రులను బంగూయ్‌లోని వివిధ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ దేశ మంత్రిత్వ శాఖ తెలిపింది. బం గూయ్‌లోని బార్తెలెమీ బొగాండా ఉన్నత పాఠశాల ఆవరణలో అధికారులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మార్‌లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసా రిగా పేలుడు సంభవించడంతో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. దీంతో ఒక్కసారిగా బయటకు దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.