calender_icon.png 27 September, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

27-09-2025 04:58:57 PM

కరీంనగర్ (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు  అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, అధికారులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.