27-09-2025 05:15:36 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని చారిత్రాత్మక ఆలయమైన కదిలి అన్నపూర్ణ పరమేశ్వర ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకుపోతుందని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. శుక్రవారం ఆలయ కమిటీ చైర్మన్గా నార్వాడే వెంకట్రావుతో పాటు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. రెండోసారి చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి చైర్మన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి దిల్వార్పూర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.