27-09-2025 05:03:08 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మహిళలను ఆరోగ్యవంతులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) అన్నారు. పోషణ మాసోస్తవంలో భాగంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగావైద్య శిభిరాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ అనితతో కలిసి ఎమ్మెల్యే వినోద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ నేడు మహిళల్లో ఎక్కువమంది రక్తహీనతతో బాధపడేవారు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల్లో నెలకొన్న అన్నిరకాల వ్యాదులకు ఈ వైద్య శిబిరంలో వైద్య చికిత్సలందిస్తారని, మహిళలు ఈ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు న్యూట్రేహన్ ఫుడ్ తీసుకొని ఆరోగ్యవంతులుగా తయారు కావాలన్నారు.
ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం అక్టోబర్ 2వ తేదీవరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్,కాంగ్రెస్ టౌన్ ప్రసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, జిల్లా సీనియర్ నాయకుడు మునిమంద రమేష్, బెల్లంపల్లి డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ వో డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా వైద్య విధాన పరిషత్ కో ఆర్డీనేటర్ డాక్టర్ కొటేశ్వర్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరేంటెండెంట్ డాక్టర్ జీడి రవికుమార్,జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, డీ పీ వో ప్రశాంతి, వైద్యులు ఇవాంజలి, శబ్బిర్ అహ్మద్,సుచరిత, పద్మ, కిరణ్ కుమారి, కృపా బాయి,తదితరులు పాల్గొన్నారు.