calender_icon.png 27 September, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు అండ ప్రజా ప్రభుత్వం...

27-09-2025 05:31:29 PM

రెండేళ్లలో మండలంలో 19 సార్లు చెక్కుల పంపిణీ..

ఎమ్మెల్యే సత్యనారాయణ.

హుజురాబాద్ (విజయక్రాంతి): పేదలకు అండగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు ఉన్నారని, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మండల కేంద్రంలోని కేశవపట్నం రైతు వేదికలో శనివారం మండలానికి చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు ఎమ్మెల్యే సత్యనారాయణ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ నాటి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో 2021లో వివిధ కారణాలతో రోగాల బారిన, ప్రమాదాల బారిన పడి చికిత్సలు చేయించుకున్న బాధితులు నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రజా పాలనలో ఎమ్మెల్యే ప్రజా భవన్ కు వచ్చి తమకు ముఖ్యమంత్రి సహాయనిధిని అందించాలని కోరడంతో, ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులకు తగిన న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నాటి పాలకుల నిర్లక్ష్యంతో మండలానికి ఒక్క ఇల్లు కూడా రాలేదని నేడు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమైన్లు మంజూరు చేసి పేదింటి ఇంటి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నామని, శంకరపట్నం మండలానికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 19వ సారి మండలంలో అన్ని గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు అందజేయడం జరుగుతుందని, ప్రజా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండే ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కొత్తగట్టు మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ కోరెం రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, ఆడెపు అజయ్, మానకొండూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ షారుక్, మాజీ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్ జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ శ్రీనివాసరెడ్డి, ఉపసర్పంచులు అడితం కుమార్, వెంగళ శ్రీనివాస్, కన్నెబోయిన జంపయ్య, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.