27-09-2025 05:52:01 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో షాహిద్ భగత్ సింగ్ 148వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో భగత్ సింగ్ 148వ జయంతి వేడుకలు బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ వద్ద మహనీయుల విగ్రహాల దగ్గర (సావిత్రిబాయిపూలే ఏడ్యూకేషనల్ సెంటర్ వద్ద నిర్వహించారు. వీరాకిశోరం స్వాతంత్ర ఉద్యమకారుడు భగత్ సింగ్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడనీ పేర్కొన్నారు.