calender_icon.png 27 September, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చొప్పదండిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

27-09-2025 05:51:47 PM

చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండిలో శనివారం రోజున ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి వేడుకలను పద్మశాలి జాగృతి సమితి అధ్యక్షులు కొండ గంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో పద్మశాలిలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని, విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్మెంట్స్ అందివ్వాలని & పద్మశాలి బిడ్డలకు ప్రత్యేకమైన సంక్షేమ కోట కేటాయించాలని పలువురు మాట్లాడాతూ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మారంపల్లి నాగభూషణం ఇప్పనపల్లి రాజేశం సిరిపురం భాస్కర్ ఎలిగేటి కృష్ణాహరి ఎలిగేటి జనార్ధన్ చేట్టిపెళ్లి  కిషన్ కొక్కుల రామ్మోహన్ దూస కైలాసపతి సిరిపురం పెద్ద గంగారం దూస నరసింగం ఊరడిమల్లేశం సిరిపురం శ్రీనివాసు కోడూరి నాగరాజు సిరిపురం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.