27-09-2025 05:47:46 PM
డి.ఎస్.పి సూర్యనారాయణ
కాటారం (విజయక్రాంతి): ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు అమూల్యమైనవని కాటారం డిఎస్పి సూర్యనారాయణ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి కూడలిలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద బాపూజీ 110వ జయంతి ఉత్సవాలను కాటారం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి సూర్యనారాయణ, ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్, మహదేవపూర్ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, ఓబిసి అధ్యక్షులు పోలు మొండయ్య, యూత్ నాయకులు కటకం అశోక్, విశిష్ట అతిథులుగా కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మాజీ జెడ్పిటిసి ఆంగోతు సుగుణ, మాజీ ఎంపీటీసీ జాడీ మహేశ్వరి, పిల్లమారి త్రివేణి, యూత్ నాయకులు చీమల రాజు తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పేదలకు, సఫాయి కార్మికులకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు దోమల సమ్మయ్య, నాయకులు మాచర్ల రాజేందర్, కొండా వెంకటేశ్వర్లు, పులి అశోక్, గాదె రమేష్, దాసరి గట్టయ్య, పలనాటి బలరాం, వలస వెంకటేశ్వర్లు, అమృతం సంతోష్, మాచర్ల సత్యం, ఎలగం సత్యనారాయణ, కనుకుట్ల తులసి శ్రీనివాస్, పల్నాటి రాజయ్య, మోత్కూరు రవి, ఎలగం రాజేశం, గుడిమల్ల శ్రీనివాస్, బత్తుల శ్రీకాంత్, సంగెం శ్రీనివాస్, జల్లారం మల్లయ్య, దోమల రాజశేఖర్, సురేష్, బాబు, గాదె వినయ్ తదితరులు పాల్గొన్నారు.