27-09-2025 04:52:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రాచీన దేవాలయమైన అడెల్లి పోచమ్మ గంగనీల జాతరలో భాగంగా శుక్రవారం అమ్మవారి నగలు గోదావరికి తరలించారు. ఆలయం నుండి భక్తుల ఊరేగింపు మధ్య దిల్వార్పూర్ మండలం సాంగ్వి గ్రామానికి నగలను తీసుకెళ్లి అక్కడ గంగనీలతో స్నానం చేసి ఆదివారం పోచమ్మ ఆలయానికి తరలిస్తారు. సారంగపూర్ మండలంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గంగనిల్ల నగలను మోసి ఈ జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బోజ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు ధర్మకర్తలు పాల్గొన్నారు.