calender_icon.png 27 September, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి

27-09-2025 05:42:07 PM

పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గోవిందరావు

హుజూర్ నగర్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని హుజూర్ నగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గోవిందరావు అన్నారు. శనివారం పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పట్టణ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొడ్డు గోవిందరావు మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమ నేత 92 ఏళ్ల వయస్సులో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం బరి గీసి కొట్లాడిన ధీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలీల ఆరాధ్యుడన్నారు. సమాజం హితం కోసం ఇచ్చిన మాట కోసంతన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడని, నేటి తెలంగాణ సమాజం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని మరువదన్నారు. ఈ కార్యక్రమంలో పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.