07-01-2026 12:00:00 AM
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
కామారెడ్డి, జనవరి 6 (విజయక్రాంతి): బాతుల కోసం ఏర్పాటుచేసిన నీటి గుంతలో రెండు సంవత్సరాల బాలుడు పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వి వరాల మేరకు బుద్ధ భాస్కర్, శివలీల భార్యాభర్తలు. ఎనిమిదేళ్లుగా కామారెడ్డి జిల్లా కేం ద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వారికి రెండేళ్ల కుమారుడు రన్విత్ కుమార్ ఉన్నాడు.
రోజులాగే ఆడుకుంటూ ఉన్న రన్వీత్‌కుమార్ సోమవారం బాతులు నీరు తాగేందుకు ఏర్పాటు చేసిన గుంతలో ప్రమాదవశాత్తు పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత రన్విత్ తల్లిద్రండులు తమ కుమారుడు కనిపించడం లేద ని చుట్టుపక్కల వెతకగా నీటి గుంతలో శవమై కనిపించాడు. దీంతో శివలీల కన్నీరు మున్నీరుగా విలపిం చింది. దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.