23-01-2026 12:20:13 AM
అధికారులకు పద్మారావు గౌడ్ ఆదేశాలు
సికింద్రాబాద్ జనవరి 22 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి లో నామాలగుండు ప్రాంతంలో నిర్మిస్తున్న జీహెచ్ ఏంసి. కొత్త వార్డు కార్యాలయం భవన సముదాయాన్ని త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావుగౌడ్ అధికారులను ఆదేశించారు.
గురువారం జీహెచ్‌ఏంసి అధికా రులతో కలిసి వార్డు కార్యాలయం నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ తనిఖీ చేశారు. రూ. రెండు కోట్ల ఖర్చుతో చేపడుతున్న ఈ కార్యాలయం నిర్మాణం పనుల్లో జాప్యం తగదని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వర్ణలత, డీఈ మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు రేషన్ కార్డులను మంజూరు
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అర్హులైన వారికి త్వరితగతిన రేషన్ కార్డులు జారీ చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ పౌర సరఫరాల అధికారి చాముం డేశ్వరి, అధికారులతో కలిసి పౌర సరఫరాల విభాగం కార్యకలాపాలను సీతాఫలమండీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పౌర సరఫరాల విభాగం సేవలు ప్రజలకు అందుబాటులో నిలపాలని సూచించారు. తమ కార్యాలయానికి కొత్త భవనo ఏర్పాటులో సహకరించాలని అధికారులు కోరారు.