23-01-2026 12:18:44 AM
సీఐ ధనంజయ గౌడ్
ఉప్పల్, జనవరి 22 (విజయక్రాంతి) : చిన్నపాటి నిర్లక్ష్యం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ప్రాణాంతకమని నాచారం ఇన్స్పెక్టర్ ధనంజయ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్రైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా రహదారి ప్రమాదాల నివారణ కోసం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాల్యూ జోన్ షాపింగ్ మాల్ లో భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదాల వల్ల అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ స్టేషన్ అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య. ప్రభాకర్ రెడ్డి నాచారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.