15-11-2025 07:21:16 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ సమీప మండలం మాసాయిపేట్ కేంద్ర పరిధిలో రోడ్డుప్రమాదం చేసుకుంది. వెనుక నుండి వచ్చినా లారీ బలంగా ఢీకొట్టగా బైకుపై ఉన్న లక్ష్మి(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా తన భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పాటి చందు తన భార్య లక్ష్మి వీరి పిల్లలు రామంతపూర్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుండగా ఫీజు కట్టే క్రమంలో అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.