calender_icon.png 15 November, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసులలో పరస్పారం రాజీతోనే సత్వర న్యాయం

15-11-2025 08:39:41 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): కోర్ట్ కేసులలో పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దీర్ఘ కాలంగా కేసుల్ని కొట్లాడకుండా, రాజీ చేసుకోవడం ఉత్తమ మార్గం అని సూచించారు. రాజీ కోసం కక్షిదారుల్లో క్రమంగా వస్తున్న మార్పు అభినందనీయం అని పేర్కొన్నారు. అనంతరం జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ లో మొత్తం 92 కేసులు పరిష్కారం చేశారు.