15-11-2025 08:21:51 PM
భూత్పూర్: మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నెలవారి హల్ ఖా ఏ జికర్ మహెఫిలే మిలాద్ ముస్తఫా కార్యక్రమం మహమ్మద్ అక్తర్ ఖాద్రి ఇంట్లో రహీం పాషా ఖాద్రి ఆధ్వర్యం లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ధార్మికవేత్త షహెజాదే గౌసే ఆజం హజ్రత్ సయ్యద్ షా ఆలే ముస్తఫా ఖాద్రీ అల్ మూసవి అల్ జిలానీ అలీ పాష సాహెబ్, మూలాన అల్హాజ్ సయ్యద్ షా బద్రుద్దీన్ హసన్ ఖాద్రి అల్ మూసవి అల్ జిలానీ సాహబ్ పాషా ఖిబ్లా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ధార్మిక సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ధార్మిక సందేశం ఇచ్చారు. అల్లా చివరిదూత మహ్మద్ ప్రవక్త (స.అస) బోధనలు ప్రపంచమానవాళికి ఆదర్శనీయమని అన్నారు. గ్యార్వీ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. హజ్రత్ గౌసే ఆజమ్ ఇస్లాం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమం అంజమనే బజ్మే ఖాద్రియ కాజ్మియా జిల్లా అధ్యక్షులు జహంగీర్ పాష ఖాద్రీ, ఆధ్వర్యంలో జరిగినది.