15-11-2025 08:26:54 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): రోడ్డు ప్రయాణం చేసే వాహనదారులు సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలని బూర్గంపాడు అదనపు ఎస్ఐ నాగభిక్షం అన్నారు. మండలంలోని సారపాక ప్రధాన రహదారిపై శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ను ధరించి రోడ్డుపై ప్రయాణం చేయాలన్నారు. వాహనాలను నిర్ణీత వేగంలో నడపాలని తెలిపారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సూరెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలను పాటించకపోతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐ వెంట ట్రైనీ ఎస్ఐ దేవ్ సింగ్, కానిస్టేబుల్ మంగిలాల్ ఉన్నారు.