15-11-2025 08:36:00 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు కబ్జాకు గురవుతుందని స్థానిక సాగునీటి, రెవిన్యూ, సబ్ కలెక్టర్ అధికారులకు బిజెపి నాయకులు పలుమార్లు ఫిర్యాదు చెయ్యడంతో శనివారం సంబంధిత శాఖ అధికారులు ఎల్లయ్య చెరువు,కాలువలు కుంటలు కబ్జాలకు గురవుతున్న వాటిని జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావ్ పరిశీలించారు. బాన్సువాడ బిజెపి నాయకులు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన సహాయకునికి ఫిర్యాదు చేయడంతో వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఇట్టి విషయమై సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశించారన్నారు.
వెంటనే స్పందించిన అధికారులు ఈరోజు బాన్సువాడ పట్టణానికి విచ్చేసిన జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు పట్టణంలోని ఎల్లయ్య చెరువు పరిశీలనకు విచ్చేసి ఎల్లయ్య చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తుప్తి ప్రసాద్ శంకర్ గౌడ్ ఎల్లయ్య చెరువు 49 ఎకరాల విస్తీర్ణ చెరువును పలువురు కబ్జా గురి అయిందని, కాలువలు చెరువులు కబ్జాలకు గురైనని కబ్జాలకు పాటుపడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీరు దృష్టికి తీసుకురాగా,
ఎల్లయ్య చెరువుపై సమగ్రంగా సర్వే చేపట్టి చెరువును కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.కాలువలు కబ్జాలు చేసినవారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు తుప్తి శివప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షుడు అనిల్ పాశం భాస్కర్ రెడ్డి, వెంకట్ ఇరిగేషన్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.