15-11-2025 08:41:14 PM
పోలీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం ముదిరాజ్
సిద్దిపేట క్రైం: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసిన పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ నిజమైన యోధుడని పోలీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ కొనియాడారు. కిష్టయ్య ముదిరాజ్ 16వ వర్ధంతి పోస్టర్‌ను శనివారం సిద్దిపేట జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ కిష్టయ్య త్యాగాన్ని నేటి తరాలు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 1న కిష్టయ్య వర్ధంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా పోలీస్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రంగధాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిటైర్డ్ ఉన్నతాధికారులు, విధుల్లో ఉన్న పోలీసులు, సామాజిక ఉద్యమకారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణలో సిద్దిపేట జిల్లా కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కొండం శ్రీనివాస్, జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు పల్లె రాజు, న్యాయ సేవ ప్రజా పరిరక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు చల్లా రవీందర్ రెడ్డి, చిన్నకోడూరు మండల్ NHRC అధ్యక్షుడు దానబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు.