15-11-2025 08:39:10 PM
- న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి..
- లోక్ అదాలత్ లో 324 కేసుల పరిష్కారం..
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు కోర్ట్ ఏరియాలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఇల్లందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. కక్షిదారులు పంతాలకు పోకుండా రాజీ పడతగిన పోలీస్ కేసులు, మనోవర్తి, గృహహింస, చెక్ బౌన్స్, సివిల్ కేసులు రాజీ చేసుకోవాలని తద్వారా ఎంతో విలువైన కాలాన్ని డబ్బు వృధా కాకుండా ఆదా చేసుకోవచ్చని అన్నారు.
లోక్ అదాలత్ రాజీ పడితే ఇరు వర్గాలు గెలిచినట్లేననిపై కోర్టుకు వెళ్లి అప్పిల్ చేసుకునే అవకాశం ఉండదని తెలిపినారు. కక్షిదారులు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె .ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, న్యాయవాదులు, దంతాల ఆనంద్, పి .బాలకృష్ణ, పి.అనిల్ కుమార్, బి రవి కుమార్ నాయక్ ఏ.భరత్ తదితరులు పాల్గొన్నారు.